Tuesday 3 May 2022

    విశాఖ మ్యూజిక్ అకాడమి - విశాఖపట్నం


ప్రముఖవాగ్గేయకారులు, పద్మవిభూషణ్
డా. మంగళంపల్లి బాలమురళికృష్ణ
సంగీతప్రపంచానికి అందించిన రచనలపై
గాత్రసంగీత పోటీలు

విశాఖ మ్యూజిక్ అకాడమి ప్రతియేటా ప్రముఖ వాగ్గేయకారులు పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళికృష్ణ జన్మదినాన ఆయనకు గౌరవ సూచకంగా ప్రత్యేకంగా ఒక సంగీతసభను నిర్వహిస్తూ వస్తోందని రసజ్ఞులకూ విశాఖవాసులకూ
విదితమే.

అంతటి గొప్పవాగ్గేయకారులూ, సంగీతవిద్వాంసులూ, గానదురంధరూలూ, వివిధ సంగీతవాద్యనిపుణులూ, అనేక అపూర్వరాగాల సృష్టికర్త అయిన మహోన్నతమైన తెలుగువానికి తగినవిధంగా నివాళుల నర్పించాలంటే, అంతమాత్ర ప్రయత్నం సరిపోదని అకాడమి భావించింది. సంగీతప్రపంచంలోనే అంతటి జ్ఞానఖని, వాగ్గేయకారుడూ, సంగీతనిథి, మరొకరు జన్మించలేదంటే అతిశయోక్తి కానేరదు. అందువలన, ఆ వాగ్గేయకారుని రచనలు కేవలం పుస్తకాలకో, సిడిలకో పరిమితమైపోకుండా, భవిష్య తరాలకు అందజేసే ప్రయత్నంగా ప్రస్తుతతరం సంగీతకళాకారులద్వారా ఆ గొప్పరచనలకు ప్రాముఖ్యతను సంతరింపజేస్తూ, ప్రాచుర్యాన్ని సమకూర్చడానికి అకాడమి ఒక ప్రణాళికను రూపొందించుకుంది. 
ఆ బాధ్యతను అకాడమీ ఆనందంగా స్వీకరిస్తూ, ప్రణాళికలో భాగంగా బాలమురళికృష్ణ రచించి గానం చేసిన వివిధ సంగీత ప్రక్రియలపై మొట్టమొదట గాత్రసంగీతపోటీలను* నిర్వహిస్తోంది. కళాకారుల వయసు ప్రాతిపదికపై ఈ క్రింద సూచించిన విధంగా *నాలుగు విభాగాలలో* పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముందుముందు ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఆకర్షణీయమైన నగదు బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికట్లను విజేతలకు అందిస్తోంది అకాడమి.

ఈపోటీలు రానున్న జూన్ 18-19 తేదీలలో* నిర్వహిస్తూ, బహుమతులను బాలమురళికృష్ణ జన్మదినమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా జూలై 9వ తేదీన (9.7.2022) ప్రత్యేక సమావేశంలో అందించడం జరుగుతుంది.

విశాఖపట్నం                        యెమ్మెస్ శ్రీనివాస్ 
20.04.2022                            కార్యదర్శి

No comments:

Post a Comment

 విశాఖ మ్యూజిక్ అకాడమి విశాఖపట్నం 54వ వార్షిక సంగీతనృత్యోత్సవాలు విశాఖ మ్యూజిక్ అకాడమి స్థానిక కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 25.11.2023 నుండి ...